ఈ మధ్య కాలంలో ఓ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోని ఆ తరువాత అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపింది. ఇక అది కూడా మన తెలుగు సినిమా.. అయితే అది జక్కన్న సినిమా కాదండోయ్..ఇటీవలే పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన పుష్ప..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వసూళ్లు పరంగా స్లో అయిన సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపి బాగా ట్రెండ్ అయ్యింది. ఇక బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఎర్ర చందనాలు స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ నటన అయితే అందరిని కట్టిపడేసింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాలోని పాటలన్ని కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఈ మూవీలోని శ్రీవల్లి పాట అన్ని భాషల్లో కూడా పెద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈసాంగ్ లో బన్నీ సిగ్నేచర్ స్టెప్ కూడా సోషల్ మీడియాను షేక్ చేసింది.ఈ సాంగ్ కు సినిమాతారల నుంచి స్టార్ క్రికెటర్స్ వరకు కూడా అందరు డాన్స్ చేసి ఆకట్టుకున్నారు.


తాజాగా మరోసారి ఈ పాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ ఈసారి ఈ సినిమాలోని సాంగ్ గురించి చర్చించడం జరిగింది. బిగ్ బి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షో లో ఈ పాటకు సంబంధించిన ఓ అంశం చర్చకు వచ్చింది. బిగ్ బి మాట్లాడుతూ ముందు ఆ సాంగ్ చూసి అల్లు అర్జున్ చెప్పు నిజంగానే ఊడిపోయిందా..? లేక స్టెప్ అలా ఉందా అని అనుకున్నా అని అన్నారు. కానీ అలా చెప్పు వదిలేసి దాన్ని మళ్లీ వేసుకొని చాలా ఫేమస్ అయ్యారు అని ఆయన చెప్పుకొచ్చారు బిగ్ బి. ఇక పుష్ప సినిమాను ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ తారలు కొనియాడిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికీ పుష్ప సాంగ్స్ సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తున్నాయి. త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: