టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు ఆయన విజయ్ దేవరకొండ కొంతకాలం క్రితం వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది. చివరగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇలా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తో తన అభిమానులను నిరుత్సాహపరిచిన విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా జ్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 25 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , హిందీ , మలయాళ , కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ సభ్యులు వరుస ఇంటర్వ్యూలలో  , వరుస ప్రెస్ మీట్  లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ ప్రమోషన్ లలో భాగంగా స్లిప్పర్స్ వేసుకొని ఈ మూవీ ప్రమోషన్ లలో పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. జనాల దృష్టిని ఆకర్షించడం కోసమే విజయ్ దేవరకొండ ఇలా స్లీపర్స్ వేసుకొని ప్రమోషన్స్ కి వెళుతున్నాడు అని విమర్శలు కూడా ఈ హీరో పై వచ్చాయి.  తాజాగా తాను స్లిప్పర్స్ తో ప్రమోషన్ కి వెళ్లడం గురించి విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చాడు. ఎలాంటి బ్రాండ్ తో సంబంధం లేకుండా తాను అన్ని వస్తువులను ఇష్టపడతానని , ఆ టైమ్ లో ఏది నచ్చితే దాన్ని ధరిస్తానని,  ప్రతి రోజు ఒక డ్రెస్, దానికి మ్యాచ్ అయ్యే షూ ల కోసం వెతుక్కోవడానికి ఎక్కువ టైమ్ పడుతుందని, అందుకే స్లిప్పర్స్ కొనుగోలు చేశానని విజయ్ చెప్పాడు. అలాగే ప్రమోషన్స్ కి స్లిప్పర్స్ ని వేసుకుని పోవడం వల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే విషయాన్ని తాను పట్టించుకోనని విజయ్ తాజాగా అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: