సినిమా ఫీల్డ్ లో నటినటులు కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఇక ఎంత పెద్ద సీనియరైనా కానీ కెరీర్ స్లో అవుతోందే అనుకున్నప్పుడు ఉన్నట్టుండి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడితే మళ్ళీ వారి ఇన్నింగ్స్ వేగమందుకుంటుంది.కొంతమందికి ఎన్ని హిట్లు వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు ఉండవు. ఇండస్ట్రీ పోకడ కూడా చిత్రవిచిత్రంగా ఉంటుంది. రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నా కానీ ఒకప్పటి రేంజ్ లో వేషాలు కానీ గుర్తింపు కానీ తగ్గిపోయిన కమెడియన్ శ్రీనివాసరెడ్డికి కేవలం ఒక నెల గ్యాప్ లో రెండు పెద్ద సక్సెస్ లు దక్కడం అందులో కూడా తనవి కథను మలుపు కీలక పాత్రలు కావడంతో మంచి గుర్తింపు వస్తోంది.ఇక గత వారం విడుదలైన బింబిసారలో జపాన్ స్టయిల్ మీసాలతో శ్రీనివాసరెడ్డి పోషించిన జుబేదా పాత్ర తనకు పెద్ద మైలేజ్ ని తెచ్చింది. సినిమా మొత్తం కనిపించకపోయినా చక్రవర్తి ఫ్లాష్ బ్యాక్ తో పాటు క్లైమాక్స్ లో అతనికి ఇచ్చిన క్యారెక్టర్ స్క్రీన్ మీద చాలా బాగా పండింది. అందుకే ప్రమోషన్లలో కళ్యాణ్ రామ్ తో పాటు ఇతను కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు.


ఇక ఈరోజు రిలీజ్ అయిన కార్తికేయ 2లో నిఖిల్ మావయ్యగా చేసిన పాత్ర కూడా అంతే పేరు తెచ్చేలా ఉంది. అరగంట తర్వాత ఎంట్రీ ఇచ్చినా చివరి ఫ్రేమ్ వరకు హీరోతో పాటే ఉండే కృష్ణుడి భక్తుడిగా తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.ఎప్పుడో 2001లో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీనివాసరెడ్డి స్పీడ్ చాలా కాలం వున్న ఈ మధ్య బాగా తగ్గింది. ఈ ఏడాది అతను కనిపించిన వాటిలో భళా తందనాన, టెన్త్ క్లాస్ డైరీస్  ఎఫ్3 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక అందులో ఆర్టిస్టులు ఎక్కువ ఉండటంతో అంతగా హైలైట్ కాలేకపోయాడు. ఇప్పుడీ బింబిసార ఇంకా కార్తికేయ 2ల పుణ్యమాని తిరిగి రేస్ లోకొచ్చాడు. ఈ రెండూ కూడా ఫాంటసీ జానర్ లో రూపొందిన చిత్రాలు కావడం గమనార్హం. ఈ సినిమాల దర్శకులు వశిష్ట, చందూ మొండేటిలతో కలిసి శ్రీనివాసరెడ్డి ప్రసాద్ ఐమ్యాక్స్ ప్రీమియర్లో గట్టిగానే సందడి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: