మిల్కీ బ్యూటీ తమన్నా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకుంది. ఆ తర్వాత తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తెలుగు నాట హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 

తమన్నా ప్రస్తుతం కూడా వరుస మూవీ లలో హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన ఎఫ్ 3 మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటించింది. 

మూవీ లో తమన్నా తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే అనేక మూవీ లలో తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ వుంటుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా తన సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా తమన్నా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ని వేసుకొని,  అందుకు తగిన రెడ్ కలర్ షూస్ ని ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: