తమిళ హీరో విజయ్ ఆంటోని గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' మూవీ తో టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందు కోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్నాడు . బిచ్చగాడు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ ఆంటోని ఆ తర్వాత తాను హీరో గా నటించిన అనేక మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల కూడా చేశాడు. కానీ బిచ్చగాడు మూవీ తర్వాత ఈ హీరో నటించిన ఏ మూవీ కూడా బిచ్చగాడు మూవీ రేంజ్ విజయాన్ని  అందుకోలేక పోయాయి . 

ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ ఆంటోని 'హత్య' అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు . ఈ మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది . ఈ మూవీ కి బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా , మురళి శర్మ , జాన్ విజయ్ , రాధిక శరత్ కుమార్ , సిద్ధార్థ శంకర్ , అర్జున్ చిదంబరం , సంకిత్ బోరా , కిషోర్ కుమార్మూవీ లో ముఖ్య పాత్రల్లో నటించారు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా హత్య చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ని 15 ఆగస్ట్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ లో హీరోయిన్ రితికా సింగ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: