తెలుగు సినిమా ఇండస్ట్రీలో బలమైన సినీ నేపథం కలిగిన ఫ్యామిలీలలో హీరో వెంకటేష్ ఫ్యామిలీ కూడా ఒకటని చెప్పవచ్చు.. రామానాయుడు స్టార్ ప్రొడ్యూసర్ గా బాల నటుడిగా వెంకటేష్ చేసింది కేవలం ఒకే సినిమాని చదువు పూర్తయిన తర్వాత వెంకటేష్ ని సినిమాల వైపు తీసుకురావాలని రామానాయుడు భావించారట. వెంకటేష్ కూడా చదువు పైన దృష్టి పెట్టారు ఆ తర్వాత వెంకటేష్ ఫారిన్ లో చదువు పూర్తి చేసుకుని అప్పుడు హీరోగా మళ్లీ తిరిగి ప్రయత్నించాడు. రామానాయుడు సూపర్ స్టార్ కృష్ణ తో ఒక సినిమా చేయాలనుకున్నారు ఆ సినిమాకి డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకుడుగా అనుకున్నారు కానీ కృష్ణ బిజీగా ఉండడం వల్ల ఆ ప్రాజెక్టును వెంకటేష్ హీరోగా పరిచయం చేయాలని భావించారు.


అందుకే ఈలోగా పరుచూరి బ్రదర్స్ కథను సిద్ధం చేయడం జరిగిందట.. ఈ సినిమానే కలియుగ పాండవులు. ఈ సినిమాలో హీరోయిన్ ఖుష్బూ ప్రతి నాయకుడు శక్తి కపూర్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. 1986 ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాకి సంగీతాన్ని చక్రవర్తి అందించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలను రాబట్టింది దాదాపుగా 14 కేంద్రాలలో 50 రోజులపాటు పూర్తి చేసుకుంది. ఇక విజయవాడలో ఏకంగా 100 రోజులు వేడుకలు కూడా జరుపుకున్నది.


అలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న వెంకటేష్.. హీరోగా తెలుగు తెరకు పరిచయమై ఇప్పటికి 36 ఏళ్లు పూర్తి చేసుకుంది అయితే ఇండస్ట్రీలో ఎంత బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా నిలబడాలంటే ప్రేక్షకుల ఆదరణ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలని చెప్పవచ్చు అలా వెంకటేష్ సినిమా సినిమాకి తనని తాను మార్చుకుంటూ డైలాగ్ లో కూడా పలుమార్పులు చేసుకుంటూ ఎదుగుతూ వచ్చారు స్టార్ హీరోలను తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వెంకటేష్. వెంకటేష్ కెరియర్లు బొబ్బిలి రాజా చంటి ప్రేమ తదితర సినిమాలు ఆయన కెరీర్ కి పునాదులను చెప్పవచ్చు. అందుచేతనే ఈయనకు విక్టరీ అనే పేరు కూడా సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: