హీరోయిన్ తమన్నా దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని దశాబ్ద కాలం పాటు అవుతోంది. ఇమే ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇక టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది.. కానీ ఈమధ్య తన హవాని అంతగా చూపించలేకపోతోంది కానీ అదృష్టమే ఏమో కానీ స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలను వరుసగా దక్కించుకుంటుంది. కమర్షియల్ గా సక్సెస్ లేకున్నప్పటికీ ఈమె హీరోయిన్గా మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నది. తమన్నా సూపర్ స్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నది.



సినిమా అనుకోని అవకాశమని చెప్పవచ్చు. ఈ విషయం తెలిసిన తమన్న చాలా సంతోషంగా ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ నటించాల్సిన పాత్రలో కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పడంతో తమన్నాకి అవకాశం వచ్చినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తమిళ సినీ ఇండస్ట్రీలో పలు చర్చిని అంశంగా మారుతున్నది. తమిళ సూపర్ స్టార్ హీరో గా రజనీకాంత్ హీరోగా ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభిస్తున్నారు. ఇక అందుకే ముందుగా ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఒక గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్లో మంచి సక్సెస్ ఉండడంతో అభిమానుల సైతం ఈ విషయం తెలియగానే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


జైలర్ చిత్రంలో ఐశ్వర్యరాయ్ నటించేందుకు మొదట ఒకే చెప్పిన కూడా కొన్ని కారణాల చేత మళ్లీ ఆమె తప్పుకున్నట్లుగా సమాచారం ఐశ్వర్యరాయ్ తప్పుకోవడంతో జైలర్ సినిమాలు రజనీకాంత్ కు జోడిగా తమన్న ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటిసారి రజనీకాంత్ తో తమ్మనా జతకట్టి నటించబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు మరియు తమిళ ప్రేక్షకులలో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంటున్న అని నమ్మకాన్ని అభిమానులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: