పెళ్లి సందD సినిమాతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది హీరోయిన్ శ్రీ లీలా. ఇక తర్వాత తెలుగులో మరియు ఇతర భాషలలో కూడా కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ప్రస్తుతం ఈ అమ్మడు జోరు మామూలుగా లేదని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. శ్రీలిలా తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో అందరిని బాగా ఆకర్షిస్తోంది. నితిన్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించిన మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో పాటకు శ్రిలిలా డాన్స్ వేయడం జరిగింది. ఇక ఈమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈమెకు ఫిదా అవుతున్నారు.


చిన్నప్పటి ఇష్టమైన సాంగ్ ఎలా డాన్స్ వేయకుండా ఉంటాను అంటూ ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఇక దీంతోపాటు వెళ్లి తెలపైన అద్భుతంగా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారని తెలిపింది. సమీపంలోని థియేటర్లలో ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతోంది వెళ్లి చూడండి అంటూ శ్రీ లీలా తను వేసిన డాన్స్ ను షేర్ చేయడంతో పాటు పనిలో పనిగా నితిన్ సినిమాకు ప్రమోషన్ చేసింది. తాను కూడా థియేటర్లలో ఈ సినిమా చూడడం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలియజేసింది.


ఇక ఈ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ పాట యూట్యూబ్ లో సత్తా చాటుతూ వస్తోంది. రికార్డు స్థాయిలో లైక్స్ ని పొందడమే కాకుండా అంజలి మరియు నితిన్ వేచిన ఈ సిగ్నేచర్ స్టెప్పు పలు స్టార్ సైతం రీల్స్ తో పాటు షార్ట్ వీడియోలో కూడా సందడి చేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీ లీలా ఈ వీడియోని షేర్ చేయడంతో మరింత ఫేమస్ అయిందని చెప్పవచ్చు. ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: