ఇక నిఖిల్ హీరోగా ఇటీవల రిలీజైన సినిమా 'కార్తికేయ 2'. చాలా మంచి టాక్ తో దూసుకుపోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ సత్తా చాటుతోంది.అయితే అసలు అంత పెద్దగా బలమైన కారణాల్లేకుండానే 'కార్తికేయ-2' సినిమాకి పదే పదే వాయిదాల సమస్య రావడంతో చిత్ర యూనిట్ తో పాటు,ఇంకా హీరో నిఖిల్ కూడా కాస్త అసహనానికి గురైన విషయం అందరికీ తెలిసినదే. దీనికి సినీ పరిశ్రమలోని రాజకీయాలు 'కార్తికేయ-2' సినిమాని వెనక్కి నెట్టేశాయన్నది ఓ వర్గం వాదన. దీనికి 'నాకే ఎందుకిలా అవుతోంది.?' అంటూ 'కార్తికేయ-2' హీరో నిఖిల్ కూడా ఈ మధ్యనే ఓ సందర్భంలో చాలా బాధపడటం దీనికి బలం చేకూర్చింది.అసలు సినిమా అంటేనే ఒక మహా యజ్ఞం. అనేక వ్యవప్రయాసలకోర్చి నిర్మాత, దర్శకుడు, ఆర్టిస్టులు ఇంకా అలాగే మిగతా టెక్నీకల్ టీమ్ ఓ తపస్సులా కష్టపడతారు. సరే, వారి శ్రమకు బదులుగా రిలీజు కాబోతుందన్న చివరి నిముషంలో సినిమా వాయిదా పడితే మాత్రం వారి బాధ అనేది అసలు వర్ణనాతీతం. అయితే అదే సినిమా చివరకు విడుదలై సూపర్ హిట్టై మంచి వసూళ్లు కనుక సాధిస్తే మాత్రం వారి బాధ పూర్తిగా తొలగిపోతుంది.


ప్రస్తుతం ఆ ఆనందంతోనే కార్తికేయ టీమ్ ఇప్పుడు పెద్ద పండగ చేసుకుంటోంది.అయితే ఇక ఈ సినిమాని వెనక్కి నెట్టేసిన సినీ రాజకీయాల గురించి ఇపుడు ఇండస్ట్రీలో కధలు కధలుగా మాట్లాడుకుంటున్నారు. వారికి ఖచ్చితంగా తగిన శాస్తే జరిగిందని నిఖిల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాని వెనక్కి నెట్టిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా ఫలితం కూడా అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాని వెనక్కినెట్టిన 'థాంక్యూ' సినిమా పరిస్థితి కూడా తెలిసినదే. దాంతో 'కార్తికేయ' సినిమా శాపం వాటికి తగిలిందని అంతా అనుకుంటున్నారు. నిఖిల్ అభిమానులు అయితే 'నిన్ను తొక్కేయాలనుకున్నారు.. వాళ్ళే దెబ్బ తిన్నారు..' అంటూ నిఖిల్‌ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు. ఈ రాజకీయం వెనుక ఓ ప్రముఖ నిర్మాత పేరు కూడా లేవనెత్తుతున్నారు. ఆయన దిల్ రాజే అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి. ఏది ఏమైన నిఖిల్ మాత్రం గట్టి హిట్టు కొట్టి తానేంటో చూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: