టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోల్లో ఒకరు అయిన నితిన్ తాజాగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో క్యాథరిన్ , కృతి శెట్టి హీరోయిన్ లుగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని దర్శకుడు ఎం ఎస్ రాజశేఖరెడ్డి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించాడు. ఈ మూవీ లో సముద్ర కని ప్రతి నాయకుడి పాత్రలో నటించగా, మహతి స్వర సాగర్మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మొదటి సారి కెరీర్ లో నితిన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన మూవీ లో నటిస్తుండటంతో ఈ మూవీ పై నితిన్ అభిమానులతో పాటు మాములు సినీ ప్రముఖులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్ట్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ మూవీ 3 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. మూడు రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 2.38 కోట్లు ,
సీడెడ్ : 1.12 కోట్లు ,
యూ ఏ : 99 లక్షలు ,
ఈస్ట్ : 68 లక్షలు ,
వెస్ట్ : 29 లక్షలు ,
గుంటూర్ : 73 లక్షలు ,
కృష్ణ : 51 లక్షలు ,
నెల్లూర్ : 38 లక్షలు ,
మూడు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మాచర్ల నియోజకవర్గం మూవీ 7.08 కోట్ల షేర్ , 11.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 37 లక్షలు .
ఓవర్ సీస్ లో : 35.లక్షలు .
మూడు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం మూవీ 7.80 కోట్ల షేర్ , 12.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: