అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ బుచ్చి బాబు సన దర్శకత్వం లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన మూవీ తో వెండితెరకు పరిచయం అయ్యింది. మొదటి మూవీతోనే ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. అలాగే ఉప్పెన మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కూడా బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టింది. మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత వరుస క్రేజీ అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మూవీ లు కూడా మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి.

ఇలా వరుసగా హ్యాట్రిక్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న కృతి శెట్టి కొంత కాలం క్రితమే రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ది వారియర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. జూలై 14 వ తేదీన ది వారియర్ మూవీ విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ది వారియర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి, నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ కి కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ లభించింది. ఈ సినిమా ప్రస్తుతం సాధిస్తున్న కలెక్షన్ లను చూస్తే ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవడం కష్టంగానే కనిపిస్తోంది. ఇలా వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న కృతి శెట్టి ప్రస్తుతం వరుస అపజయాలను ఎదుర్కొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: