టీవీ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ పోలీసులను ఆశ్రయించిందట.. ఓ వ్యక్తి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.


పోలీసులకు కంప్లైంట్ చేసిన పట్టించుకోవడం లేదంటూ వాపోయింది. గుర్తు తెలియని వ్యక్తి వీడియో సెక్స్ చేయాలంటూ తనను వేధిస్తున్నాడని, అతని గురించి పోలీసులు వ్యవహరిస్తున్న తీరే ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారట.. ఈ మేరకు తన గోడును సోషల్ మీడియా వేదికగా వెల్లబోసుకుంది.


సదరు వ్యక్తి వేధింపులకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్‌ను, సుదీర్ఘమైన మ్యాటర్‌ను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ కూడా చేసింది ఉర్ఫీ జావేద్. మార్ఫింగ్ చేసిన తన ప్రైవేటు ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ విలపించింది. ''ఓ వ్యక్తి నన్ను చాలా కాలంగా వేధిస్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం ఎవరో నా ఫోటోను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్‌లో సర్క్యూలేట్ చేశారు. అది అప్పుడే నా దృష్టికి రాగా, పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ సమయంలో నేను నరకం అనుభవించాను. ఇప్పుడు ఆ మార్ఫింగ్ ఫోటోను పట్టుకుని ఓ వ్యక్తి వీడియో సెక్స్ చేయమని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట.. లేదంటే ఆ ఫోటోను రకరకాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా కెరీర్‌ను నాశనం చేస్తానంటూ కూడా బెదిరిస్తున్నాడు.'' అని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది.


ఇదిలాఉంటే.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయింది. ''అతని విషయంలో కంటే.. పోలీసులు వ్యహరిస్తున్న తీరు నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. 1వ తేదీన ముంబైలోని గోరెగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 14 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈ విషయంలో పోలీసుల తీరుపట్ల తీవ్ర నిరాశకు గురయ్యాను. ముంబై పోలీసుల గురించి చాలా మంచి విషయాలు విన్నాను కానీ, ఈ వ్యక్తి పట్ల వారి వైఖరి విచిత్రంగా ఉంది. అతను ఎంత మంది మహిళలలను ఇలా వేధింపులకు గురి చేశాడో ఆధారాలతో సహా తెలియజేసినప్పటికీ, ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఏది ఏమైనా ఈ వ్యక్తి సమాజానికి, ముఖ్యంగా మహిళలకు చాలా ప్రమాదకరం. స్వేచ్ఛగా జీవించడానికి అతను అర్హుడు కాదు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు గానీ, అతను మాత్రం స్వేచ్ఛగా సంచరిస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని పేర్కొంది.


ఉర్ఫీ జావేద్ ఈ మధ్యకాలంలో చాలా బాగా ఫేమస్ అయ్యింది. తన హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేసి, నిత్యం కూడా వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఉర్ఫీ జావెద్‌కు విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. గత ఏడాది బిగ్ బాస్ ఓటీటీ లో కూడా పాల్గొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: