అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను శైలజ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ మొదటి మూవీ తోనే బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని, ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను తెలుగు లో దక్కించుకొని ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా  కొనసాగుతోంది.

కొంత కాలం క్రితమే కీర్తి సురేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. కీర్తి సురేష్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.

ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ మరో క్రేజీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆకాశమే నీ హద్దురా మూవీ తో  ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు  సుధా కొంగర ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా మూవీ ని హిందీ లో డైరెక్ట్ చేస్తోంది. ఈ మూవీ తర్వాత ఈ దర్శకురాలు ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మూవీ లో మెయిన్ లీడ్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలి అని యూనిట్ యూనిట్  డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథ చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ కి కీర్తి సురేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: