విభిన్న చిత్రాలతో తెలుగు మరియు తమిళ ప్రేక్షకులను అలరించే హీరోగా విజయ్ అంథోనీకి మంచి పేరుంది. స్వతహాగా ఇతను తమిళ్ రంగానికి చెందిన వారు అయినప్పటికీ, తెలుగు లోనూ తనకంటూ మంచి డిమాండ్ ను ఏర్పరుచుకున్నాడు. ముఖ్యంగా సస్పెన్స్ కథలను మంచి స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి అందరినీ సర్ప్రైజ్ చేస్తుంటాడు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా... రైటర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తన ప్రతిభను ఇప్పటికే నిరూపించుకున్నాడు.

కెరీర్ మొదట్లోనే తన సినిమాలతో అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. కానీ బిచ్చగాడు అనే అమ్మ సెంటిమెంట్ సినిమా తన లైఫ్ ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా కు విశేష ప్రజాధారణ లభించింది. ఇది తమిళ్ సినిమా అయినా తెలుగులో దీనికి ఎక్కువగా కలెక్షన్ లు వచ్చాయి. అయితే గత కొంతకాలంగా తన సినిమాలు ఏవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. అందుకే ఈ సారి హిట్ కొట్టాలని ఎంతో కమిట్మెంట్ గా మరొక ఉత్కంఠ కలిగిన కథతో మన ముందుకు రానున్నారు.

విజయ్ ఆంథోనీ హత్య అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి మరియు రితిక సింగ్ కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా విజయ్ ఇందులో ఒక డిటెక్టివ్ గా కనిపించి ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా మొత్తం ఒక అమ్మాయి మర్డర్ నేపథ్యంలోనే జరుగుతుంది అని తెలుస్తోంది. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ ను చ ఉడగానే సినిమాపై మరింత ఆసక్తి కలుగుతోంది. అయితే అమ్మాయిని ఎవరు హత్య చేశారు ? హంతకుడిని విజయ్ ఆంథోనీ తన డిటెక్టివ్ ఆలోచనలతో పెట్టుకున్నాడా ? లాంటి విషయాలకు సమాధానం దొరకాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమాను ప్రతిక్షణం ఎంతో సస్పెన్స్ గా ఉండేలా దర్శకుడు బాలాజీ కుమార్ తెరకెక్కించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: