టాలీవుడ్‌ నిర్మాతలంతా కూడా యూనిటీగా ఉంటామని, తమ మధ్య ఎప్పుడైనా ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంటుందని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. వ్యూస్‌ కోసమో, లేదా క్లిక్‌ కోసం ఇలా తప్పుడు వార్తలు రాస్తూ ఇండస్ట్రీ వాళ్లని బలిపశువు చేయొద్దని ఆయన కోరారు.మంగళవారం నాడు హైదరాబాద్‌లో జరిగిన కార్తికేయ 2 సక్సెస్‌ మీట్‌లో దిల్‌ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల తనపై వచ్చిన పుకార్లపై దిల్ రాజు స్పందించాడు.'కార్తికేయ2 సినిమా రిలీజ్‌కు ముందు చాలా సార్లు కూడా నిఖిల్‌ నాతో మాట్లాడారు. జులై 8 వ తేదీన 'థాంక్యూ'చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కుదర్లేదు. దీంతో అదే నెల 22న మా సినిమాను విడుదల చేయాలని మేము భావించాం. ఇదే విషయాన్ని కార్తికేయ2 సినిమా నిర్మాతల్లో ఒక్కరైన వివేక్‌తో చెప్పాను. 'మీరు అల్రెడీ జులై 22 వ తేదీకు విడుదల చేస్తామని పోస్టర్‌ వేసుకున్నారు కదా.. మాకు ఏమైనా అవకాశం ఇస్తారా 'అని వివేక్‌ని నేను అడిగాను. మా హీరో ఇంకా డైరెక్టర్‌తో మాట్లాడి చెప్తా అన్నారు.ఆ తర్వాత ఒక్కరోజు నిఖిల్‌, చందు నన్ను కలిసేందుకు మా ఇంటికి వచ్చారు.మాట్లాడుకొని సినిమా విడుదల తేదిని మేము మార్చుకున్నాం.


 అక్కడితో ఈ సమస్య తీరింది. ఆగస్ట్‌ 12న కార్తికేయ2 సినిమా విడుదల చేస్తామని అనుకున్నారు. నేను కూడా సపోర్ట్‌ ఇస్తానని చెప్పాను. ఇలా చర్చలు జరుతుండగానే కొందరు 'దిల్ రాజు సినిమాను తొక్కేస్తున్నాడు'అంటూ ఏవేవో కథనాలు రాసేశారు. ఇక్కడ ఎవరు ఎవరి సినిమాని కూడా తొక్కరు. అది రాసేవాళ్లకి ఇంకా చదివేవాళ్లకు ఉండాల్సిన మినిమం కామన్‌సెన్స్‌.ఇక్కడ ఎవరి సినిమా ఆడినా కూడా మేమంతా ఆనందపడతాం. ఒక్క సినిమా సక్సెస్‌ అనేది మాకు ఇంకో సినిమా తీయడానికి ఊపిరి పోస్తుంది.అంతేకానీ ఇక మాలో మాకు ఏదో క్రియేట్‌ చేస్తూ.. మీ క్లిక్స్‌ కోసం ఇంకా వ్యూస్‌ కోసం మమల్ని బలిపశుల్ని చేయ్యొద్దు. వాస్తవాలు తెలుసుకొని రాయండి. తెలియకుంటే మూసుకోండి. నేను సినిమా కోసం నేను ప్రాణం ఇస్తాను. పాడు చేయాలని ఎప్పుడూ కూడా అనుకోను. డబ్బులు నష్టపోయి కూడా ఎన్నో సినిమాలు విడుదల చేశాను. ఇక ఇవన్నీ మీకు తెలియదు'అంటూ దిల్‌రాజు ఎమోషనల్‌గా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: