మంచి సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ తాజాగా చేసిన ఎపిక్ మూవీ కార్తికేయ 2. ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమాతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.బ్లాక్ బస్టర్ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా నటించింది.నిజానికి ఈ సినిమా షూటింగ్ అనేది ఎప్పుడో ఫినిష్ అయినా కూడా ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక చివరకు ఆగష్టు 13 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ మూవీ చాలా మంచి టాక్'తో దూసుకెళ్తుంది. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఎదురు చూస్తున్న పలు చిత్రాల్లో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా కూడా నిలిచింది.నార్త్ లో కార్తికేయ 2 సినిమాకి క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. మొదటి రోజు నుండి భారీగా థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది.మూడో రోజు ఈ చిత్రానికి అక్కడ భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. అయితే నేటి నుండి మరింత గా ఈ దియేటర్ల సంఖ్య అనేది పెరగనుంది.రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని అద్భుతాలు కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది.


ఇక సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఇండిపెండెన్స్ డే హాలిడే అయితే ఓ రేంజ్ లో కలిసి వచ్చి అన్ని సెంటర్స్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా చేయగా ఇంకా ఈ రోజు సాధించిన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.మూడు రోజుల్లో టార్గెట్ ని కంప్లీట్ చేసుకుని లాభాల లోకి ఎంటర్ అయిన కార్తికేయ 2 సినిమా టాలీవుడ్ తరుపున ఈ ఇయర్ క్లీన్ హిట్ అయిన11 వ సినిమాగా నిలిచింది. ఇంకా ఈ లిస్టులో 4 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నప్పటికీ మొత్తం మీద స్ట్రైట్ తెలుగు సినిమాలు 7 ఉండటం ఖచ్చితంగా విశేషం అని చెప్పాలి.US లో ఈ సినిమా 600K డాలర్ల పైగా వసూళ్లు రాబట్టింది.ఇక 3 వరుస హిట్స్ కేవలం 1 వారం గ్యాప్ లోనే టాలీవుడ్ కి సొంతం అవ్వడం ఇప్పుడు మరింత స్పెషల్ అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకున్న కార్తికేయ 2 సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తి కరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: