టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోల్లో ఒకరైన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఇలా తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి ఏం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా , క్యాథరిన్ , కృతి శెట్టి ఈ మూవీ లో నితిన్ సరసన హీరోయిన్ లుగా నటించారు. కెరీర్ లో మొట్ట మొదటి సారి నితిన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన మూవీ లో నటిస్తుండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 21.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 22 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన మాచర్ల నియోజకవర్గం మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ లో కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న మాచర్ల నియోజకవర్గం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 9.05 కోట్ల షేర్ , 15.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మాచర్ల నియోజకవర్గం మూవీ బాక్సా ఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే ఇంకా 12.95 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టి బలిసి ఉంది. మరి మాచర్ల నియోజకవర్గం మూవీ రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: