సీతారామం చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఈ చిత్రం మంచి విజయం దక్కించుకోవడంతో పాటుగా ఈమె ఈ సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించిందని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు బడా నిర్మాతలు, దర్శకులు సైతం సినిమాలో నటించమని కోరుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీత వంటి పద్ధతైన ఒక పాత్రను చేసిన మృణాల్ మరి రాబోయే రోజులలో ముందు ముందు ఎలాంటి సినిమాలలో నటిస్తుందో అంటూ అభిమానులు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీతారామం చిత్రంలో చాలా నిండు అమ్మాయిగా కనిపించిన మృణాల్ నటనను చూస్తే ఎవరైనా చేతులెత్తి దండం పెట్టాల్సిందే అన్నట్లుగా నటించింది.అయితే రాబోయే సినిమాలలో స్కిన్ షో వంటివి సినిమాలలో నటిస్తే తెలుగు ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒకవైపు సీతగా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్న మృణాల్ ఠాగూర్. మరొకవైపు తాజాగా బ్యాక్ లెస్ ఫోటోలతో అందరికీ షాక్ ఇచ్చింది. ఈమె ఫోటోలు చూసిన పలువురు నెటిజన్ల సైతం ఈమె మా సీతే నా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక్కసారిగా ఇలాంటి బ్యాక్ లెస్ బోల్డ్ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ సీతారామం సినిమాలో తమ పాత్రలలో అద్భుతంగా జీవించి నటించారు. దాంతో పాటుగా ఒక అద్భుతమైన ప్రేమ కథను ఈ సినిమాతో డైరెక్టర్ హానురాగవపూడి తెలుగు ప్రేక్షకులకు చూపించారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ రష్మిక కూడా నటించింది. ఇక లవ్ స్టోరీ గా వచ్చినా ఈ చిత్రం మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. ఇటీవల ఈ చిత్రం రూ. 50 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: