బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ కు ప్రత్యక స్థానం ఉంది. తాను నటించే పాత్ర విషయంలో మనసు పెట్టడమే కాకుండా ఆపాత్రలోకి పరకాయ ప్రవేశంచేసి తన పాత్ర కోసం ఎంతైన కష్టపడతాడు అమీర్ ఖాన్. అలాంటి అమీర్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా పరాజయాలు వెంటాడుతున్నాయి.


దీనితో గ్యాప్ తీసుకుని ఎన్నో ఆలోచనలు చేసి అమీర్ ‘లాల్ సింగ్ చద్దా’ నిర్మించాడు. ఈసినిమా విడుదల ముందు నుంచి కూడ ఈసినిమాను బోయికాట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో జరిగిన నెగిటివ్ ప్రచారం ఈసినిమా పై తీవ్ర ప్రభావం చూపించింది. హాలీవుడ్ లో క్లాసిక్‌ మూవీగా పేరు తెచ్చుకున్న ‘ఫారెస్ట్ గంప్’ను రీమేక్ చేయడంలో అమీర్ ఖాన్ తప్పటడుగు వేసినట్లుగా కనిపిస్తోంది.


ఈమూవీ కథను మనదేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయకుండా చాల నిజయితీగా ఈ మూవీని రీమేక్ గా తీసాడు. అక్కడే పొరపాటు జరిగింది అని అంటున్నారు. హాలీవుడ్ మూవీ ఒరిజనల్ లో హీరోగా చేసిన టామ్ హాంక్స్‌తో పోలిస్తే కొంచెం భిన్నంగా చేయాలని ఆమిర్ తన పాత్ర విషయంలో అతి చేయడం ఈసినిమాకు మైనస్ గా మారింది అన్నకామెంట్స్ వస్తున్నాయి.

అమీర్ ఖాన్ అలా జోకర్ లా నటించడం చాలమందికి నచ్చలేదు. అంతేకాదు ఒక జోకర్ ఆర్మీలో చేరి యుద్ధాలు ఎలా చేస్తాడు అంటూ కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎంతో కఠినంగా సాగే ఆర్మీ ట్రయల్స్‌లో ఒక జోకర్ లా కనిపించిన అమీర్ ఖాన్ ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక సినిమా అంతా కృత్రిమంగా అసహజంగా మరో మాటలో చెప్పాలి అంటే ఈమూవీ చూసినవారికి తీవ్ర అసహనాన్ని కలిగించడంతో ఈమూవీ అమీర్ ఖాన్ కెరియర్ లోనే ఘోరమైన ఫెయిల్యూర్ గా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఏది ఎలా ఉన్నా భారత దేశం గర్వించే ఒక గొప్పనటుడు సినిమాకు ఇలాంటి ఫ్లాప్ టాక్ రావడం అత్యంత దురదృష్టకరం..



మరింత సమాచారం తెలుసుకోండి: