కొన్ని సినిమాలు కథగా అనుకున్నప్పుడు ఒకలా అనిపిస్తాయి.. అవి తెర మీదకు వెళ్లాక మరోలా మారిపోతాయి. కథగా విన్నప్పుడు మాములుగా ఐనిపిస్తే.. అదే కథ తెర మీద చూసినప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి. అలాంటి కథ సీతారామం. హను రాఘవపుడి డైరక్షన్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమా ఓ ఇద్దరు తెలుగు హీరోలు వదులుకున్నారంటే షాక్ అవ్వాల్సిందే.

సీతారామం సినిమా చూశాక రామ పాత్రకి దుల్కర్ సల్మాన్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించింది. ఆయనే ఆ సినిమాకు పూర్తిగా న్యాయం చేశారు. కానీ హను రాఘవపుడి ఈ కథ అనుకున్నప్పుడు మన తెలుగు హీరోల్లో ఇద్దరు హీరోలను ఊహించుకున్నారట. అందులో ఒకరు నాని కాగా.. మరొకరు రాం అని తెలుస్తుంది. దుల్కర్ సల్మాన్ వర్క్ అవుట్ కాకుంటే నాని కానీ రామ్ తో కానీ ఈ సినిమా చేయాలని హను అనుకున్నాడట. నాని కి సీతారామం కథ చెప్పగా స్టోరీ బాగున్నా హను అంతకుముందు సినిమా పడి పడి లేచే మనసు ఫ్లాప్ అవడంతో సినిమా కాదన్నారట.

ఇక రామ్ అయితే సీతారామం సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని వద్దనేశారట. అలా మన హీరోలు కాదని చెప్పాక దుల్కర్ సల్మాన్ కి కథ చెప్పడం అతను ఓకే చేయడం జరిగిందట. ఈ సినిమా కాదన్న హీరోలు ఇప్పుడు ఓ మంచి సినిమా మిస్ అయ్యామన్న ఆలోచన రాక మానదు. నానికి ఇలాంటి సినిమాలు మళ్లీ రావొచ్చేమో కానీ రామ్ మాత్రం సీతారామం మిస్ అవ్వడం బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. హను రాఘవపుడి సీతారామం సినిమాతో తన సత్తా చాటారు. సినిమాతో మన తెలుగులో కూడా మణిరత్నం లాంటి ఒక దర్శకుడు ఉన్నాడని ప్రూవ్ చేశాడు. అంతకుముందు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సీతారామం తో స్టార్ డైరక్టర్ రేంజ్ కి వెళ్లాడు హను రాఘవపుడి.


మరింత సమాచారం తెలుసుకోండి: