సినీ పరిశ్రమల షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సినిమాలు వాయిదా పడుతూ ఉండడం సర్వసాధారణం . ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సెన్సార్ పనులు పూర్తిచేసుకుని సినిమా విడుదల కావడం అంటే అది చాలా కష్టం అని చెప్పవచ్చు ఇప్పటికీ కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని సినిమాలు చాలానే ఉన్నాయి అయితే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలు అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. దాదాపుగా 40 సంవత్సరాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన చిత్రం ఇప్పుడు తాజాగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధం గా ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి ఎందుకు వాయిదా పడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి అగ్ర హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. ఎన్ని సూపర్ హిట్ చిత్రాలలో నటించారు ఇండస్ట్రీ కి హిట్లను కూడా అందుకున్నారు. అయితే ఏఎన్ఆర్ నటించిన ఒక చిత్రం దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత విడుదలవుతోంది. ఇక ఇందులో జయప్రద ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ చిత్రం 1982 లో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా పేరు ప్రతిబింబాలు.

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్, కేఎస్ ప్రకాష్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అప్పట్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది కానీ కొన్ని కారణాలవల్ల విడుదల కాలేదు దీంతో మళ్లీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన ఏఎన్ఆర్ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం ఈ చిత్రాన్ని నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ... ఈ సినిమా కొన్ని కారణాల చేత విడుదల ఆగిపోవడం జరిగింది ప్రస్తుతం సాంకేతికలన మిలితం చేసి సరికొత్త అంగులతో ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ -20 న విడుదల చేయబోతున్నట్టుగా తెలిపారు తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: