ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమం ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది. అయితే ఒకప్పుడు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లకి ఈ కార్యక్రమం కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం డాన్స్ పర్ఫార్మెన్స్ లు మాత్రమే కాదు  కామెడీ షోలకు మించి ఎంటర్టైన్మెంట్ కూడా ఈ షోలో ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పాలి. అందుకే ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇప్పటివరకూ ఎంతోమంది డాన్స్ మాస్టర్ లకు డీ షో లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇకపోతే ప్రస్తుతం ఢీ కార్యక్రమంలో భాగంగా ప్రతివారం ఒక సరికొత్త థీమ్ నిర్వహిస్తూ అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక మధ్యలో హైపర్ ఆది సహా మరికొంతమంది టీం లీడర్లు చేసే కామెడీ ఎంటర్ టైన్ మెంట్ రోజురోజుకు పెరిగిపోతోంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే విడుదలైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ప్రతీ వారం లాగానే ఈ వారం లవ్ అనే ఒక సరికొత్త థిమ్  నిర్వహించారు. ఈ క్రమంలోనే కంటస్టెంట్స్ అందరు కూడా ఈ థీమ్ ప్రకారమే డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేశారు.



 అయితే ఇక ఈ ప్రోమో లో భాగంగా అన్ని పర్ఫామెన్స్ లు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే ప్రోమో చివర్లో షో లో ఉన్న టీం లీడర్లు సహా యాంకర్ ప్రదీప్ తో పాటు అందరూ తమ ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది మాట్లాడుతూ ఒక అమ్మాయి తనతో అటు గవర్నమెంట్ స్కూల్లో చదివింది. ఆ తర్వాత ఆమె ప్రైవేటు కు వెళ్ళి పోయింది. నేను కూడా తర్వాత ప్రైవేట్ స్కూల్లో చేరాను. అప్పుడు రెండేళ్ల తర్వాత ఆ అమ్మాయిని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఎప్పటికీ మరిచిపోలేను అంటూ తన మొదటి ప్రేమను తలుచుకుంటూ మైమరచిపోయాను హైపర్ ఆది. ఇది తెలిసి హైపర్ ఆది అప్పట్లోనే ప్రేమలో పడ్డాడా అని అనుకుంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: