కొన్ని సినిమాలు కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయినట్లుగా పేరు దక్కించుకుంటూ ఉంటాయి. మరికొన్ని చిత్రాలు కమర్షియల్ గా పర్వాలేదనిపించుకున్నప్పటికీ.. టాక్ పరంగా మాత్రం ఫ్లాప్ అన్నట్లుగానే ఉంటాయి. ఓటీటి లో విడుదలైన నాని 25వ చిత్రం వి సినిమా ఎలాంటి ఫలితం దక్కించుకుందో అందరికీ తెలిసిన విషయమే ఈ సినిమాని డైరెక్టర్గా ఓటీటిలో విడుదల చేయడంతో పెద్దగా జనాలు పట్టించుకోలేదు. పైగా ఈ సినిమాకు నెగటివ్ టాక్ ను కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది.


అందుచేతనే ఈ సినిమా ఫ్లాప్ అంటూ స్వయంగా నాని అభిమానులు కూడా తేల్చి చెప్పడం జరిగింది. కానీ నాని ఆ సినిమాను ఫ్లాప్ అంటే ఒప్పుకోలేదు.. వి సినిమా ఒక మంచి సినిమా అంటూ తెలియజేశారు. తాజాగా ఆ సినిమాలో నటించిన మరొక నటుడు సుదీర్ బాబు కూడా ఇదే విషయాన్ని తెలియజేయడం జరుగుతోంది. సుధీర్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.. అక్కడ మాట్లాడుతూ.. వి సినిమా ఫ్లాప్ కాదు అన్నట్లుగా తెలియజేశారు. వి సినిమా ఫ్లాప్ అంటూ ఒక రిపోర్టర్ మాట్లాడిన విషయంలో.. సుధీర్ బాబు స్పందిస్తూ ఆ సినిమా ఫ్లాప్ అంటే తను ఒప్పుకోనని స్పందించడం అందర్నీ అక్కడ ఆకర్షిస్తోంది.


ఇక ఆ సినిమాతో చాలా ప్రశంసలు కూడా దక్కాయని సుధీర్ బాబు తెలిపారు..IMBD తో పాటు పలు ప్లాట్ఫార్మ్స్ పై కూడా ఈ సినిమా మంచి రేటింగును సంపాదించుకుందని సుధీర్ బాబు తెలిపారు. ఆన్లైన్లో కూడా ఇప్పటికీ ఈ చిత్రం మంచి వ్యూస్ ని రాబడుతున్నట్లు ఆయన స్పందించడం జరిగింది. మొత్తానికి ఎవరు అవునన్నా కాదన్నా కూడా వి సినిమా ఫలితం గురించి జనాలకి మాత్రం తెలుసు .. ఇక తర్వాత సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాకు మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: