టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన మారుతి గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మారుతి ఈ రోజుల్లో అనే ఒక చిన్న మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ని ప్రారంభించాడు . తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఈ రోజుల్లో మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని మారుతి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తీసుకు వచ్చింది .

ఈ రోజుల్లో తర్వాత మారుతి దర్శకత్వం వహించిన బలే బలే మగాడివోయ్ , ప్రతి రోజూ పండగే వంటి మూవీ లు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందు కున్నాయి . ఇది ఇలా ఉంటే తాజాగా మారుతి , గోపీ చంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ కి దర్శకత్వం వహించాడు . మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది . ఇది ఇలా ఉంటే దర్శకుడు మారుతి, రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం వరస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ తన ప్రస్తుత కమిట్మెంట్ లు పూర్తి కాగానే మారుతి తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి కూడా ప్రభాస్ సినిమా కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని మారుతి తక్కువ రోజుల్లో, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మారుతి, రెబల్ స్టార్ ప్రభాస్ తో ఎలాంటి మూవీ ని తెరకెక్కిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: