టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ తాజాగా పాన్ ఇండియా మూవీ లైగర్ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో మనకు కనిపించ బోతున్నాడు . డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేమూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. మైక్ టైసన్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో ఈ మూవీ లో రమ్యకృష్ణ నటించింది. ఈ మూవీ ని ఆగస్ట్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం లైగర్ చిత్ర బృందం దేశ వ్యాప్తంగా ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా లైగర్ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా లైగర్ చిత్ర బృందం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన యూ విడుదల చేసింది. లైగర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్ట్ 20 వ తేదీన సాయంత్రం 5 గంటలకు చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్ , మోతుగూడా , గుంటూర్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: