నాగార్జున హీరోగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దశకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ది ఘోస్ట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉంటోంది. ఇక ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజశేఖర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గరుడవేగ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఘోస్ట్ సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో రానుండడంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రంలో కూడా వైల్డ్ డాగ్ చిత్రంలో ఏజెంట్ పాత్రలో నాగార్జున మరొకసారి నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చిత్ర బృందం దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే చిత్రబంధం తమ సినిమా ప్రమోషన్లను ప్రారంభించింది. ఈ క్రమంలోనే తాజాగా తమహగనే ప్రోమో పేరుతో ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. తమ హాగానే అని ప్రోమోను విడుదల చేశారు చిత్రబంధం అసలు ఈ పదం ఏమిటి దీని అర్థం ఏంటనే విషయం అందరిని సందేహంలో పడి వేసింది. ఇక ఈ రోజున సస్పెన్స్ కు తెర తీస్తోంది ఈ చిత్రం.  తమ హగనే అర్థం తోపాటు ప్రోమో ను  కూడా విడుదల చేశారు.


కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమో ఒక్కసారిగా ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేసింది. అండర్ వరల్డ్ మొత్తాన్ని దాడి చేయడానికి తన పైకి వస్తున్న నేపథ్యంలో నాగార్జున వారిని ఎలా ఎదుర్కొంటారో చూపించారు. ఈ క్రమంలోనే.. హాగనే అంటే విలువైన ఉక్కు అని చెబుతూ నాగార్జున ఉక్కు తో ఒక కత్తి ని తయారు చేయడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక అండర్ వరల్డ్ గ్యాంగ్ పైన ఎలా ఎటాక్ చేయబోతున్నాడు అన్నదానిని ప్రోమో రూపం లో చూపించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమో చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: