ఇందులో భాగంగానే చిత్రబంధం తమ సినిమా ప్రమోషన్లను ప్రారంభించింది. ఈ క్రమంలోనే తాజాగా తమహగనే ప్రోమో పేరుతో ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. తమ హాగానే అని ప్రోమోను విడుదల చేశారు చిత్రబంధం అసలు ఈ పదం ఏమిటి దీని అర్థం ఏంటనే విషయం అందరిని సందేహంలో పడి వేసింది. ఇక ఈ రోజున సస్పెన్స్ కు తెర తీస్తోంది ఈ చిత్రం. తమ హగనే అర్థం తోపాటు ప్రోమో ను కూడా విడుదల చేశారు.
కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమో ఒక్కసారిగా ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేసింది. అండర్ వరల్డ్ మొత్తాన్ని దాడి చేయడానికి తన పైకి వస్తున్న నేపథ్యంలో నాగార్జున వారిని ఎలా ఎదుర్కొంటారో చూపించారు. ఈ క్రమంలోనే.. హాగనే అంటే విలువైన ఉక్కు అని చెబుతూ నాగార్జున ఉక్కు తో ఒక కత్తి ని తయారు చేయడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక అండర్ వరల్డ్ గ్యాంగ్ పైన ఎలా ఎటాక్ చేయబోతున్నాడు అన్నదానిని ప్రోమో రూపం లో చూపించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమో చాలా వైరల్ గా మారుతోంది.