ప్రేమ కథలను వెండితెరపై అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అని పేరు కలిగిన దర్శకుడు హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే ప్రేమ కథ చిత్రం ఇది దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా , మృణాలిని ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది .

మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా, భూమిక చావ్లా , సుమంత్ , తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన సీతా రామం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ప్రస్తుతం కూడా ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇలా ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకున్న సీతా రామం మూవీ పై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు.  

వెంకయ్య నాయుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా 'సీతా రామం' మూవీ గురించి స్పందిస్తూ ... "సీతారామం" మూవీ ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్య కావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ మూవీ ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది. అంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా 'సీతా రామం' మూవీ గురించి స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: