RC16 : ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో  ఆర్ సీ 15 సినిమాతో బిజీగా వున్నాడు. ఇక చరణ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ మీద  ఓ సినిమా చేస్తాడని, దానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు అని అనౌన్స్‌మెంట్‌ వచ్చిన విషయం తెలిసిందే.ఆ అనౌన్స్‌మెంట్‌ తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ కూడా లేవు. 'జెర్సీ' హిందీ సినిమా ఫలితంతో గౌతమ్‌తో చరణ్‌ సినిమా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అనే డిస్కషన్స్‌ కూడా జరిగాయి.అయితే రామ్ చరణ్‌తో సినిమా పక్కాగా ఉంటుందని గౌతమ్‌ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ సినిమా మీద ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు చాలా వేగంగా సాగుతున్నాయట. శంకర్‌ సినిమాను రామ్ చరణ్‌ ముగించేయగానే మేకోవర్‌కు కాస్త టైమ్‌ ఇచ్చి.. సినిమా స్టార్ట్‌ చేయాలని ఆయన చూస్తున్నారట.గౌతమ్‌ మొత్తం కథను కూడా సిద్ధం చేసి ఇటీవల చరణ్‌కు వినిపించాడట. 


ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా విని కథను ఓకే చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం డైలాగ్‌ వెర్షన్‌ పనుల్లో సినిమా ఉందని సమాచారం తెలుస్తుంది. శంకర్‌ సినిమా విడుదల అవ్వగానే గౌతమ్‌ సినిమా స్టార్ట్‌ అవుతుంది అని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. కానీ 'ఇండియన్‌ 2' సినిమా కోసం శంకర్‌.. చరణ్‌ సినిమాకు గ్యాప్‌ ఇస్తున్నాడని వార్తలొస్తున్నాయి. కాబట్టి ఈలోపు గౌతమ్‌ సినిమా మొదలుపెడతారామో అనే అంచనాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.శంకర్‌ సినిమా కోసం రామ్ చరణ్‌ మేకోవర్‌ అనేది గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు యాప్ట్‌ అవ్వదని చెబుతున్నారు. ఇక పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో గౌతమ్‌ సినిమా ఉంటుందట.ఈ సినిమాకి అనిరుధ్ రవి చందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.దీంతో ఈ సినిమా పక్కాగా ఉంటుందని కన్ఫర్మ్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: