సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి విజయం, అంతకు మించిన క్రేజ్ లబిస్తూ ఉంటాయి. అలా నటించిన మొదటి మూవీ తోనే బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం,  అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో కృతి శెట్టి ఒకరు. 

కృతి శెట్టి 'ఉప్పెన' మూవీ తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని, అంతకు మించిన క్రేజ్ ను సంపాదించుకుంది. మొదటి మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మకు ఆ తర్వాత అనేక క్రేజీ మూవీ లలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ అనేక తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించి హీరోయిన్ గా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకుంది. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ థియేటర్ లలో విడుదలయ్యింది. 

ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే వరుస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న కృతి శెట్టి అప్పు డప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కృతి శెట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: