నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయిన పూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూర్ణ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా అనేక ముఖ్యమైన పాత్రల్లో నటించి కూడా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది . 

పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ లో పూర్ణ ఒక కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ లోని పూర్ణ పాత్రకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం పూర్ణ, నాచురల్ స్టార్ నాని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

పూర్ణ సినిమాలు మాత్రమే కాకుండా తాజాగా త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అలాగే డీ డాన్స్ ప్రోగ్రాం కు పూర్ణ జడ్జిగా కూడా  వ్యవహరిస్తోంది. ఇలా మూవీ లతో , వెబ్ సిరీస్ లతో , టీవీ షో లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న పూర్ణ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా పూర్ణ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో చాలా క్లాస్ గా, డీసెంట్ గా, ట్రెడిషనల్ గా లంగా ఓని ధరించి అంతే క్లాస్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూర్ణ కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డిఫరెంట్ అండ్ ట్రెడిషనల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: