హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని  ఠాకూర్ హీరోయిన్ గా సీతా రామం అనే మూవీ తెరకెక్కిన విషయం మనందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన సీతా రామం సినిమా ఇప్పటి వరకు రెండు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  రెండు వారాల్లో సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 6.76 కోట్లు , సీడెడ్ : 1.54 కోట్లు , యూ ఏ : 2.54 కోట్లు , ఈస్ట్ : 1.43 కోట్లు , వెస్ట్ : 96 లక్షలు , గుంటూర్ : 1.12 కోట్లు , కృష్ణ : 1.31 కోట్లు , నెల్లూర్ : 64 లక్షలు .రెండు వారాలకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 16.30 కోట్ల షేర్ , 28.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.86 కోట్లు . ఇతర భాషలలో : 5.45 కోట్లు . ఓవర్ సీస్ లో : 5.75 కోట్లు . రెండు వారాలకు గానూ ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 29.36 కోట్ల షేర్ , 58.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  భూమిక చావ్లా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ , సుమంత్మూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: