తెలుగు సినిమా రంగం స్థాయి ఒక రేంజ్ లో పెరిగిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పుణ్యమా అంటూ టాలీవుడ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గిరాకీ అనేది ఏర్పడింది. “బాహుబలి 2”, “RRR” లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి ఇండియాలోనే పెద్ద రికార్డ్ సృష్టించడం తెలిసిందే.ఇక ఈ రెండు సినిమాలు తెలుగు నటీనటులతో తెరకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమాలకు మంచి ప్రాధాన్యత లభించడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన “RRR” సినిమా ఆస్కార్ బరిలో నిలిచినట్లు వార్తలు వచ్చాయి.అమెరికా ప్రముఖ మీడియా వెరైటీ అనే మ్యాగజిన్ సంస్థ rrr సినిమా ఆస్కార్ బరిలో ఉన్నట్లు బెస్ట్ యాక్టర్ గా తారక్ రేసులో ఉన్నట్లు లిస్టు ప్రకటించడం కొద్ది రోజుల క్రితం సోషల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరొక సినిమా కూడా ఆస్కార్ బరిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


పూర్తి విషయంలోకి వెళ్తే నేచురల్ స్టార్ నాని ఇంకా సాయి పల్లవి నటించిన “శ్యామ్ సింగరాయ” సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉన్నట్లు సరికొత్త వార్త వినబడుతోంది.యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసికల్ కల్చరల్… డాన్స్ ఇంకా అలాగే పిరియాడికల్ ఫిల్మ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్ బరిలో ఎంపికైనట్లు టాక్ అనేది నడుస్తోంది. ఏదో ఒక విభాగానికి ఆస్కార్ వచ్చిన టాలీవుడ్ ఖ్యాతి ప్రపంచానికి మరోసారి తెలుస్తుందని తాజా వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ రేసులో మన తెలుగు సినిమాలు ఉన్నట్లు వార్తలు రావడం నిజంగా టాలీవుడ్ స్థాయి పెరిగింది అని కాలర్ ఎగరేసి చెప్పవచ్చు.రెండిటిలో ఏ సినిమాకి వచ్చినా కూడా అది టాలీవుడ్ పరిశ్రమకి మంచి గర్వకారణం. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాకి చాలా టఫ్ కంపిటిషన్ అనేది ఉంది. శ్యామ్ సింగారాయ్ కి కంపిటేషన్ అనేది తక్కువగా వుంది. కానీ ఆస్కార్ బరిలో ఏం జరుగుతుందో చెప్పలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: