ఇక కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. సెప్టెంబర్ 30 వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా ఇది. ఈ సినిమా తెరకెక్కించడానికి ఆయన చాలా రకాలుగా కష్టపడ్డారు.కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ లైకా ప్రొడక్షన్స్ సహాయంతో తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు మణిరత్నం. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్ ఇంకా అలాగే త్రిష ఇలా చాలా మంది పేరున్న నటీనటులు కనిపించబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ ఇంకా అలాగే హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియోను కూడా విడుదల చేశారు. ఇక దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ మీట్ లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ మణిరత్నం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి థాంక్స్ చెప్పారు మణిరత్నం. కానీ ఆయనకు థాంక్స్ ఎందుకు చెబుతున్నానో.. ఇప్పుడే చెప్పనని ఆయన సస్పెన్స్ లో పెట్టేశారు. బహుశా చిరంజీవిసినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చి ఉండొచ్చని టాక్ నడుస్తుంది.


ఇదే సమయంలో మణిరత్నం.. ఎస్ ఎస్ రాజమౌళికి కూడా థాంక్స్ చెప్పారు. రాజమౌళి కారణంగానే ఇలాంటి సినిమాలు చేయడానికి చాలా ధైర్యం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మణిరత్నం చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ఇదిలా ఉండగా.. ఈ సినిమా కథ తమిళ నేటివిటీకి సంబంధించినది కావడంతో మిగిలిన భాషల్లో ఎంతవరకు వర్కవుట్ అవుతుందా..? అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఇక ఒకప్పుడు తమిళనాడు సహా పలు ప్రాంతాలను ఏలిన చోళ రాజుల కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.సాధారణంగా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అక్కడి నేటివిటీని కాస్త జోడించి సినిమాలు తీస్తుంటారు కోలీవుడ్ దర్శకులు. దీని వలన అక్కడ ప్రేక్షకులకు సినిమా రుచించినా కూడా వేరే రాష్ట్రాలకు చెందిన ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు.అయితే ఈ నేటివిటీ ఫ్యాక్టర్ అనేది శృతి మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కొంతలో కొంతైనా.. స్థానిక ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కథను మార్చాల్సి ఉంటుంది.ఇక 'బాహుబలి' లాంటి సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే దానికి కారణం.. అది కల్పిత కథ కాబట్టి దానికి పరిమితులు అనేవి ఉండవు. అయితే దీంతో అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.ఇక పొన్నియిన్ సెల్వన్ ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: