నిఖిల్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. అలా కార్తికేయ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా కార్తికేయ 2 మూవీ ని దర్శకుడు చందు మొండేటి, నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కించాడు. ఈ మూవీ లో వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ మూవీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 12.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కార్తికేయ 2 మూవీ 13.30 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ దక్కడంతో అతి తక్కువ రోజుల్లోనే కార్తికేయ 2 మూవీ బాక్సా ఫీస్ దగ్గర జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 28.03 కోట్ల షేర్ , 50.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఇప్పటి వరకు ఈ సినిమా 14.73 కోట్ల లాభాలను అందుకుంది. ఇలా కార్తికేయ 2 మూవీ జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే  డబల్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి వారం రోజుల్లోనే డబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: