నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే . ఈ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతోంది . అందులో భాగంగా ఈ మూవీ హిందీ వర్షన్ కూడా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతు ముందుకు దూసుకు పోతుంది . కార్తికేయ 2 మూవీ మొదటి రోజు తో పోలిస్తే రోజు రోజుకు కలెక్షన్ లను పెంచుకుంటూ ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతోంది. ఈ మూవీ ఇప్పటి వరకు 7 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా రోజు వారీగా హిందీ లో ఈ మూవీ సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

కార్తికేయ 2 మూవీ హిందీ లో మొదటి రోజు 7 లక్షల కలెక్షన్ లను రాబట్టింది. రెండవ రోజు ఈ మూవీ హిందీ లో  28 లక్షల కలెక్షన్ లను రాబట్టింది. మూడవ రోజు ఈ మూవీ హిందీ లో  1.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.  4 వ రోజు ఈ మూవీ హిందీ లో 1.28 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. 5 వ రోజు ఈ మూవీ హిందీ లో 1.38 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.  6 వ రోజు ఈ మూవీ హిందీ లో 1.64 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు ఈ మూవీ హిందీ లో  2.46 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. ఇలా కార్తికేయ 2 మూవీ హిందీ వర్షన్ వసూళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: