పెళ్ళి సందడి సినిమాతో తెలుగు తెరపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కుర్ర బ్యూటీ శ్రీలీల. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా కానీ ఈ బ్యూటీ హాట్ పెర్ఫామెన్స్ కు అయితే మాత్రం మంచి మార్కులు పడ్డాయి.ఇక అంతే కాదు శ్రీలీలా గ్లామర్ కు ఆడియన్స్ చాలా ఫిదా అయ్యారు. అటు మాస్ ప్రేక్షకులను ఇటు క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో విపరీతంగా ఆకట్టుకుంది ఈ హాట్ అండ్ క్యూట్ బ్యూటీ.ఇక ఈ సినిమా అంతో ఇంతో సక్సెస్‌ అయ్యిందంటే అందులో ఎక్కువభాగం క్రెడిట్ శ్రీలీలకే దక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల తన అందం ఇంకా అభినయంతో చలాకీ అమ్మాయిగా ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.శ్రీలీలా అంటే యూత్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. అందుకే అది గమనించిన మూవీ మేకర్స్ ఆమెకు వరుసగా అవకాశాలు కట్టబెడుతున్నారు. అందుకే ఈ హాట్ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. కాగా తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ నుండి మరో క్రేజీ ఆఫర్ కూడా వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది.


ఈ ఏడాది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సినిమాల్లో డీజే టీల్లు కూడా ఒకటి. మార్చ్‌12 వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా మూడంటే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని చాలా భారీగా వసూళ్ళను రాబట్టింది. ఈ మూవీలో ముఖ్యంగా సిద్థు జోన్నలగడ్డ పెర్ఫామెన్స్ ఇంకా అతని మాస్ యాంగిల్ కు లేడీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందంటూ మేకర్స్ అప్పుడే అనౌన్స్ చేశారు. దాంతో ఆడియన్స్ ఈసినిమా కోసం ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సీక్వెల్ మూవీ.. అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. కాగా ఈ సీక్వెల్‌లో సిద్దూకు జోడీగా కుర్ర బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మేకర్స్ హీరోయిన్‌గా పలువురు పేర్లు అనుకున్న కూడా చివరికి శ్రీలీలను ఎంపిక చేశారట.అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ అనేది మాత్రం రాలేదు.ఇక ఈ విషయంలో అధికారికంగా ప్రకటన అనేది రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: