మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమా మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులను కూడా తీవ్ర నిరుత్సాహ పరిచింది. అలా ఆచార్య మూవీ తో తన అభిమానులను మరియు మామూలు ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన చిరంజీవి ఈ సంవత్సరం 'గాడ్ ఫాదర్' మూవీ తో  మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ తో పాటు ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో కూడా హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా, మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, మహతి స్వర సాగర్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ , మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతోంది. 

ఇది ఇలా ఉంటే రేపు అనగా ఆగస్ట్ 22 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే భోళా శంకర్ చిత్ర బృందం ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. తాజాగా భోళా శంకర్ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని 14 ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ఈ రెండు మూవీ లతో పాటు మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో కూడా ఒక మూవీలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: