మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు .మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఏమాత్రం అలసిపోకుండా స్టార్ హీరోలకు పోటీగా ప్రజెంట్ వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' పిక్చర్ ను విజయ దశమి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.ఇక 'భోళా శంకర్' ను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.ఇదిలావుంటే తాజాగా ఈ గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.ఇక  మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్

 తాజాగా విడుదల కావడంతో మెగాస్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.అయితే ఇది ఇలా ఉంటే ఈ టీజర్ లో కొన్ని ట్రోలింగ్స్ కు గురవుతున్నాయి.అయితే ఇక   ఈ సంగతులు అలా పక్కనబెడితే..చిరంజీవి తనకు సినిమాలో ఆ రోల్ వస్తే బాగుండని చాలా కాలం అనుకున్నారు.ఇకపోతే   ఆ పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పోతే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా మెగాస్టార్ చిరంజీవియే ఈ విషయమై చెప్పుకొచ్చారు.అయితే  తన సినీ జీవితంలో తనకు భగత్ సింగ్ లాంటి గొప్ప వీరుడి కథ వస్తే బాగుండని చెప్పారు.కాగా భగత్ సింగ్ పాత్రను వెండితెర మీద తను పోషించాలి అనుకున్నానని,

కానీ, దర్శకులు కాని నిర్మాతలు కాని తన వద్దకు ఆ విషయమై రాలేదని తెలిపారు. అయితే, ఇక  'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పాత్ర పోషించారు చిరంజీవి.ఇకపోతే చిరంజీవి పాలిటిక్స్ కు వెళ్లి మళ్లీ సినీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. అయితే బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఫిల్మ్ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు చిరంజీవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: