దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం సినిమా ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో నటించగా, సుమంత్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటి వరకు సీతా రామం  మూవీ 17 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.

17 రోజుల్లో సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. నైజాం : 7.56 కోట్లు , సీడెడ్ : 1.65 కోట్లు , యూ ఏ : 2.80 కోట్లు , ఈస్ట్ : 1.58 కోట్లు , వెస్ట్ : 1.05 కోట్లు , గుంటూర్ : 1.26 కోట్లు , కృష్ణ : 1.46 కోట్లు , నెల్లూర్ : 71 లక్షలు . 17 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 18.07  కోట్ల షేర్ , 32.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  : 2.15 కోట్లు . ఇతర భాషలలో :  6.40 కోట్లు . ఓవర్ సీస్ లో :  6.15 కోట్లు . ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 17 రోజుల్లో 32.77 కోట్ల షేర్ , 65.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: