డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం rrrసినిమా దేశవ్యాప్తంగా పలు సంచలనాలను సృష్టించింది. ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించారు ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఇక అల్లు అర్జున్ అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ చిత్రం 1920లో జరిగిన ఒక కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కించారు రాజమౌళి. ఈ చిత్రంతోనే ఎన్టీఆర్ రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు.


ఇక దీంతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ స్టార్స్ సైతం ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు ఇక ఆస్కార్ బరిలో ఈ సినిమా నిలుస్తుంది అని వార్తలు కూడా బాగా వైరల్ గా మారాయి. ఇందులో ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే  రెండు రోజుల క్రితం హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఎన్టీఆర్ తో భేటీ అవ్వడం జరిగింది.


ఇక ఆదివారం నోవాటెల్ హోటల్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ఇక ఒక అర్థగంట పాటు సాగిన వీరి భేటీగా పలు విషయాలు చర్చనియంశంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భేటీ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ను హైదరాబాదులో కలుసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉంది అని అమితాబ్ షా ట్వీట్ ద్వారా తెలియజేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడి మొదలైందని చెప్పవచ్చు. ఇక ఈ భేటీ అనంతరం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ..RRR నటన ప్రదర్శించిన ఎన్టీఆర్ను అభినందించేందుకు ఈ భేటీ నిర్వహించారని ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని తెలియజేశారు. దీంతో కొంతమంది మాత్రం ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్నారా మళ్లీ అలాంటి తప్పుకే చేయబోతున్నారా అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: