యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కంటిన్యూ అవుతున్నారు . ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కంటిన్యూ అవుతున్నా జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజుల క్రితం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా పాపులారిటీ ని సంపాదించుకున్నాడు . ఆర్ ఆర్ ఆర్ మూవీ లో రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించడానికి కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే.

మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ మూవీ గా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర బృందం ఒక మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటె ఈ సినిమా షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఈ మూవీ అక్టోబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పక్క క్లారిటీతో ఉండడానికి కొరటాల శివ మరింత సమయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా , రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: