మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితమే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించగా పూజా హెగ్డేమూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను కూడా ఇప్పటికే మూవీ యూనిట్ లు అధికారికంగా ప్రకటించాయి.

మరి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు ఏమిటి ... అవి ఏ తేదీలలో విడుదల కాబోతున్నాయి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ లో సత్యదేవ్ , సల్మాన్ ఖాన్ , నయనతార ముఖ్య పాత్రలో నటిస్తుండగా, తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని 5 అక్టోబర్ 2022 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ తో పాటు చిరంజీవి, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని 11 జనవరి 2023 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ రెండు మూవీ లతో పాటు చిరంజీవి 'భోళా శంకర' అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తమిళ హిట్ మూవీ వేదళం కి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా, ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ మూవీ ని 14 ఏప్రిల్ 2023 న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: