బాలీవుడ్ లో వయసు పెరుగుతున్నా ఇప్పటికీ అంతే క్రేజ్ ను సంపాదించుకుని వరుస సినిమాలు మరియు షో లతో కోట్ల సంపాదనను వెనకేసుకుంటున్నారు. ఇక డబ్బుల సంపాదన ప్రధమ ద్యేయంగా పెట్టుకోకుండా సమాజంలో ఫేమ్ ను కూడా కాపాడుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అటువంటి హీరోలలో బిగ్ బి అమితాబ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ లు ఉన్నారు.

అమితాబ్ బచ్చన్: అమితాబ్ బచ్చన్ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉంటారంటే అతిశయోక్తి కాదు. తాను హీరోగా ఉన్నప్పుడు ఎటువంటి క్రేజ్ అయితే ఉందో నేటికీ కూడా అదే క్రేజ్ ఉంది. ఇప్పుడు అయితే హీరోగా కాకుండా సహాయక పాత్రలు, కొన్ని షోలు చేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అమితాబ్ కు తన పేరుమీద ఒక నిర్మాణ సంస్థ ఉండేది, కానీ దీని మూలంగా చాలా నష్టాలను ఎదొర్కొన్నాడు. ఆ తరువాత కౌన్ బనేగా కరోడ్ పతి అనే షో ద్వారా మళ్ళీ పూర్తి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం అయితే అమితాబ్ ఒక రోజుకి ఒక కోటి 20 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.

సల్మాన్ ఖాన్: ఈయన ప్రస్తుతం ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. సల్మాన్ కు బీయింగ్ హ్యూమన్ అనే బ్రాండ్ ఉంది. ఇది కాకుండా పన్వేల్ ప్రాంతంలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉంది. ఇలా వీటన్నిటి ద్వారా సల్మాన్ ఒక రోజుకి కోటి రూపాయల వరకు ఆర్జిస్తున్నాడు.

షారుఖ్ ఖాన్: ఖాన్ త్రయంలో ఎక్కువ క్రేజ్ ఉన్న నటుడు షారుఖ్ ఖాన్ అని చెప్పాలి. తన స్టైల్ మరియు నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈయన కూడా హిట్ ప్లాప్ అన్న తేడా లేకుండా వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ పోతున్నాడు. షారుఖ్ కి రెడ్ చిల్లీస్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఇది కాకుండా ఒక VFX సంస్థ మరియు కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ జట్టుకు యజమానిగా ఉన్నారు. ఇలా వీటి ద్వారా షారుఖ్ ఒక రోజులో ఒక కోటి 40 లక్షలు వరకు సంపాదిస్తున్నారు.

అమిర్ ఖాన్: అమిర్ ఖాన్ గురించి చెప్పుకోవాలంటే ఈ ఆర్టికల్ సరిపోదు. నటన అంటే ఎంత పిచ్చి అంటే... నిరంతరం కొత్త కొత్త పాత్రలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఈయన ఒక రోజుకి 33 లక్షల 50 వేలు మాత్రమే సంపాదిస్తున్నాడు.

అక్షయ్ కుమార్: ఖాన్ త్రయం తర్వాత పెద్ద హీరోలలో అంతటి క్రేజ్ ను తెచ్చుకున్న హీరో అక్షయ్ కుమార్. ఈయన కూడా డిఫరెంట్ కథలను ఎంచుకుని కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలను చేస్తూ ఉన్నాడు. ప్రెజెంట్ కూడా రక్షాబంధన్ అనే సినిమాతో వచ్చాడు. కానీ ఇది ప్లాప్ అయి కూర్చుంది. అయితే ఇతను ఒక రోజులో అమీర్ ఖాన్ కన్నా ఎక్కువగా సంపాదిస్తుండడం విశేషం. ఒక రోజుకి కోటి వరకు సంపాదిస్తున్నాడు.

ఇలా బాలీవుడ్ లో అగ్రహీరోలుగా ఉన్న వారు ఒక రోజులో అంత మొత్తంలో సంపాదిస్తున్నారు. అందుకే వీరి సినిమాలు ప్లాప్ అవుతున్నా... పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు.




























































ఈ అగ్రహీరోల

మరింత సమాచారం తెలుసుకోండి: