నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది . శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్షమూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఇప్పటి వరకు కార్తికేయ 2 మూవీ పది రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నైజాం : 9.13 కోట్లు , సీడెడ్ : 3.83 కోట్లు , యూ ఏ : 3.36 కోట్లు , ఈస్ట్ : 1.96 కోట్లు , వెస్ట్ : 1.27.కోట్లు , గుంటూర్ : 2.06 కోట్లు ,  కృష్ణ : 1.72 కోట్లు , నెల్లూర్ : 75 లక్షలు .రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజులకు గాను కార్తికేయ 2 మూవీ 24.08 కోట్ల షేర్ , 39.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  2.00 కోట్లు . ఓవర్ సీస్ లో :  4.40 కోట్లు . నార్త్ ఇండియా లో :  8.25 కోట్లు . ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లో కార్తికేయ 2 మూవీ 38.73 కోట్ల షేర్ , 74.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మరి రాబోయే రోజుల్లో కార్తికేయ 2 మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లనీ రాబడుతోంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: