మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే తమన్న ఎన్నో విజయ వంతమైన మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించు కుంది . ఇది ఇలా ఉంటే తమన్నా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను అలరించింది .

ఈ సంవత్సరం మొదట గా తమన్నా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది . మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలి పోయింది . ఆ తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లో హీరో లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర పర్వా లేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది .

ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను అలరించిన తమన్నా ఈ సంవత్సరం గుర్తుందా శీతాకాలం మూవీ తో మరొక సారి ప్రేక్షకులను అలరించ బోతోంది . ఈ మూవీ లో సత్య దేవ్ హీరో గా నటించగా తమన్నా హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ కి నాగశేఖర్ దర్శకత్వం వహించాడు . ఈ సంవత్సరం సెప్టెంబర్ 9 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది .  మరి ఈ సంవత్సరం గుర్తుందా శీతాకాలం మూవీ తో అయిన మిల్కీ బ్యూటీ తమన్నా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందు కుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: