తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి మహానటి మూవీ తో ఎంట్రీ ఇచ్చి మొదటి తెలుగు మూవీ లోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహానటి మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్న దుల్కర్ సల్మాన్ తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం అనే మరో తెలుగు మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ,  రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్ ,  భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఆగస్ట్ 5 వ తేదీన ఈ మూవీ విడుదల అయ్యింది. ఇప్పటి వరకు సీతా రామం మూవీ 19 రోజుల బాక్సా ఫీస్  రన్ ని కంప్లీట్ చేసుకుంది. 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ సాధించిన కలెక్షన్ ల వివరాల గురించి తెలుసుకుందాం.  నైజాం : 7.86 కోట్లు , సీడెడ్ : 1.69 కోట్లు , యూ ఏ : 2.93 కోట్లు , ఈస్ట్ : 1.65 కోట్లు , వెస్ట్ : 1.09 కోట్లు , గుంటూర్ : 1.32 కోట్లు , కృష్ణ : 1.51 కోట్లు ,  నెల్లూర్ : 73 లక్షలు .
19 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం  మూవీ 18.78 కోట్ల షేర్ , 33.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.25 కోట్లు . ఇతర భాషలలో :  6.60  కోట్లు . ఓవర్ సీస్ లో : 6.25 కోట్లు . ప్రపంచ వ్యాప్తంగా 19 రోజుల్లో సీతా రామం  మూవీ 33.88 కోట్ల షేర్ , 67.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: