టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న పూరి జగన్నాధ్ సినిమాలకు ఒక స్థాయి ఉంది. ఇతని సినిమాలలో హీరోయిజం, మాస్, డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతాయి. అయితే మధ్యలో తన కెరీర్ దెబ్బతింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టి లైన్ లోకి వచ్చాడు. తాజాగా ఈయన తెరకెక్కించిన మోస్ట్ వాంటెడ్ మూవీ "లైగర్" రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ లలో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లోకి వివిధ ప్రమోషన్ ల ద్వారా సినిమాను తీసుకెళ్లారు. అందుకే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకెత్తుతోంది.

కాగా ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో హాలీవుడ్ నుండి బాక్సర్ మైక్ టైసన్ ను నటింపచేశారు. ఇది నిజంగా ఇండియన్ ఫ్యాన్స్ కు షాకింగ్ అని చెప్పాలి. అయితే డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇతని పాత్రను ఏ విధంగా  మలిచాడు అన్నది ప్రధానంగా ఈ సినిమా విజయానికి ఆయువు అవుతుందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఇది కాకుండా విజయ్ కు మరియు మైక్ టైసన్ కు మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా సినిమా విజయానికి దొహదపడతాయి.

కాగా విజయ్ కెరీర్ లో తొలిసారిగా ఇలాంటి పాత్రను చేస్తున్నాడు. ఇందులో విజయ్ ఒక బాక్సర్ గా నటించడమే కాకుండా... నత్తి కూడా ఉండడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కలుగుతోంది. ఇందులో విజయ్ కి తల్లిగా మాస్ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండడం కూడా ప్లస్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఎన్ని సమీకరణాలు మనము అనుకున్నా చివరిగా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది మాత్రం ప్రేక్షకులే. మరి చూద్దాం విజయ్ మరియు పూరి ల కాంబో జనాన్ని మెప్పిస్తుందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: