సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది ఊహకందని విధంగానే ఉంటుంది. కొంతమంది మంచి పాపులారిటీ సంపాదించడానికి ఏళ్లకేళ్లు కష్టపడుతూ ఉంటే.. మరి కొంత మంది మాత్రం ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు స్టార్లుగా స్టార్లుగా కొనసాగుతున్న వారు చివరికి ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువై దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న రాశి ఇప్పుడు కష్టాలు వలయంలో నలిగిపోతుంది అనేది తెలుస్తుంది.


 ఇక ఆమెకు ప్రస్తుతం సహాయం చేసే వారే కరువయ్యారు అనేది తెలుస్తుంది. సాధారణంగా హీరోయిన్లు అనగానే కోట్ల సంపాదన ఎన్నో కూడబెట్టిన ఆస్తులు ఉంటాయి అందరూ అనుకుంటారు. కానీ కొంతమంది విషయంలో వాస్తవ పరిస్థితులు వేరేలా ఉంటాయి. అయితే కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు అటు గ్లామర్ ని కాపాడుకోవడం కోసం కూడా గట్టిగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు సర్జరీలు కూడా చేసుకుంటున్నారు
 అయితే ఒకప్పుడు తన అందం అభినయంతో ఆకట్టుకున్న రాశి ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అయిపోయింది. ఛాన్సులు కూడా లేవు.


 చివరికి  సీరియల్స్ లో కూడా నటించడం మొదలు పెట్టింది. సీరియల్స్ లో చేస్తే సినిమాల్లో అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. అయితే రాశికి అప్పులు కాస్త ఎక్కువగానే ఉన్నాయట.. అంతేకాదు నిర్మాతగా కొన్ని సినిమాలు చేసి చివరికి ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకొంది. ఎక్కువ సీరియల్స్ లో నటిస్తే ఎక్కువ డబ్బు వస్తుంది అని రాసి నిర్ణయం తీసుకుందట. తన సర్కిల్ లో ఉన్న వాళ్ళని ఛాన్సుల కోసం రిక్వెస్ట్ చేస్తుందట. దాదాపు 15 కోట్లకు పైగా అప్పులు ఉన్న రాసి తీవ్ర ఇబ్బందుల్లో ఉంది అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: