పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్‌ మూవీ ఆదిపురుష్ షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతోంది. అయితే ఈ ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం అంటూ సినిమా ని ప్రారంభించిన సమయంలో దర్శకుడు ఓమ్‌ రౌత్‌ అధికారికంగా ప్రకటించాడు.ఇకపోతే ఇప్పటి వరకు సినిమా కు సంబంధించిన ఎలాంటి అప్డేట్‌ ను ఇవ్వలేదు.అయితే  ఆ మధ్య సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తాం అన్నట్లుగా ప్రకటించాడు.ఇదిలావుంటే  కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్‌ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ వరకు వాయిదా వేసే ఉద్దేశ్యంతో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇకపోతే  సినిమా ఆలస్యం అయినా కూడా ఫస్ట్‌ లుక్ ను తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్‌ యొక్క ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రెడీ అయ్యింది.అయితే ఆ పోస్టర్ కు చిన్న చిన్న మార్పులను ఇటీవలే ప్రభాస్‌ సూచించగా ఆ మార్పులు చేస్తున్నారు. పోతే అన్ని భాషలకు కలిపి ఒకే పోస్టర్ ను విడుదల చేయబోతున్నారట.ఇక  ఆ పోస్టర్ లో ప్రభాస్ సినిమా లుక్‌ ను రివీల్‌ చేయబోతున్నారు.కాగా  ఇప్పటి వరకు సినిమా లో ప్రభాస్ ఎలా ఉంటాడు.. రామాయణం అంటున్నారు..అయితే  మరి రాముడి లుక్ లో కనిపిస్తాడా అంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటి వరకు ఎన్నో ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్స్ వచ్చి ఇలా ఉంటే బాగుండు.. అలా ఉంటే బాగుండు అన్నట్లుగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎట్టకేలకు ఆదిపురుష్ కు సంబంధించిన ఫస్ట్‌ లుక్ ను రివీల్‌ చేసేందుకు ముహూర్తం దాదాపుగా ఖరారు అయినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే  ఆదిపురుష్‌ సినిమా యొక్క పోస్టర్‌ ను సెప్టెంబర్‌ మూడవ వారం లో సరైన సమయం చూసి విడుదల చేయబోతున్నారు. కాగా కృతి సనన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్‌ రావణుడిగా నటిస్తున్న విషయం తెల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: